Thursday, May 2, 2024

AP: చంద్రబాబు వస్తే జన్మభూమి కమిటీలే.. ఎంపీ మిథున్ రెడ్డి

చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సచివాలయాలు ఉండవని, జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రుణమాఫీ అంటూ డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు వస్తే వాలంటీర్లను తొలగిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా బాగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల మధ్య తేడాలను ప్రజలు గమనించాలని చెప్పారు. టీడీపీ హయాంలో ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని… పెన్షన్ల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం అన్నీ ఇంటి వద్దకే వచ్చేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. మనకు మేలు చేసిన వారి రుణం తీర్చుకోవాలని… జగన్ ను మళ్లీ సీఎం చేసుకోవాలని ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement