Sunday, April 28, 2024

Anna Canteen:క‌నిగిరి అన్నా క్యాంటిన్ లో చంద్ర‌బాబు బ్రేక్ ఫాస్ట్ … కార్య‌క‌ర్త‌ల‌తో ముచ్చ‌ట్లు

కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరిలో టిడిపి అధినేత చంద్రబాబు రెండోరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన ఏడాదిగా ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఆయన శ‌నివారం ఉద‌యం సంద‌ర్శించారు.. ఈ క్యాంటిన్ ఏర్పాటు చేసి సంవ‌త్స‌రం అయిన సంద‌ర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు.

అనంత‌రం ఆయ‌న స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యకర్తలు, అభిమానులతో క‌ల‌సి బ్రేక్ ఫాస్ట్ చేశారు.. అనంత‌రం వారితో క‌లిసి ఫొటోలు దిగి ఉత్సాహపరిచారు. ఇదే సంద‌ర్భంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. కాగా, వైకాపాకు చెందిన పలువురు నాయకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement