Monday, April 29, 2024

సీబీఏ, ఎఫ్‌ఎ1 ప్రశ్నాపత్రాలను పాఠశాలలకు సీఆర్పీలు చేర్చాలి.. ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌

అమరావతి, ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో 15 వేలకు పైన పాఠశాలలలో ఒకే టీ-చర్‌ పనిచేస్తున్నాడని, ఆ టీ-చర్‌ ప్రతిరోజు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వెళ్లి ప్రశ్నాపత్రాలు తెచ్చుకోవాలని డిసిసిబి అధికారులు సూచించండం అన్యాయంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. కొన్ని పాఠశాలలు మండల కేంద్రానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా ఉన్నవని, ఉపాధ్యాయుడు విద్యార్థులను వదిలి ప్రతిరోజు రెండు పూటలా ఏ విధంగా ప్రశ్నాపత్రాలు తెచ్చుకోవాలని ప్రశ్నించింది.

ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గమనించాలని, ప్రతి మండలానికి ప్రభుత్వం నలుగురు లేదా ఐదుగురు సిఆర్పిలను కేటాయించినది కనుక సిఆర్పిలు వారి పరిధిలోని పది పాఠశాలలకు ప్రశ్నాపత్రాలు చేరిస్తే ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలిపింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ టీ-చర్స్‌ గిల్డ్‌ ప్రతినిధి సిహెచ్‌ ప్రభాకర్‌ రెడ్డి బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement