Tuesday, May 21, 2024

న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసె వారిపై కేసు..

ఆటో డ్రైవర్‌తో పాటు మరొకరిపై తిరుమల విజిలెన్స్ వింగ్‌ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్సులోని స్కానింగ్‌ సెంటర్‌లో విజిలెన్స్ వింగ్‌ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న పాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియన్‌, అతని స్నేహితులను కలిపి ముగ్గురిని విచారించారు. తిరుపతిలో ఆటోడ్రైవర్‌ మాన్‌కుమార్‌, సౌందర్‌ కలసి దర్శన టికెట్లు ఇప్పిస్తామని చెప్పారని, ఇందుకోసం ఫోన్‌పేలో రూ.4 వేలు, మరో 4 వేలు నగదు ఇచ్చామని భక్తులు తెలిపారు.

ఈ టికెట్లతో దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా నకిలీవిగా తేలడంతో మోసపోయామని గుర్తించామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వింగ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నకిలీ దర్శన టికెట్లతో మోసం చేస్తే వారి వాహనాలను, డ్రైవింగ్‌ లైసెన్సులను స్వా ధీనం చేసుకుని కోర్టులో హాజరు పరుస్తామని టీటీడీ సీవీఎస్‌వో గోపి నాథ్ జెట్టి హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement