Saturday, February 24, 2024

టైరు పేలి బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం (వీడియో)

అనంతపురం జిల్లా సింగనమల మండల పరిధిలో అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారి పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలి శనివారం ఉదయం ప్రమాదం సంభవించింది. టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బెంగళూరు నుండి బనగానపల్లెకి వెళ్తుండగా ఘటన సంభవించింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారు జామున 3:45 నిమిషాలు సమయంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అధికారులు, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహ‌కులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement