Sunday, April 28, 2024

Encounter – వైసిపి కోవర్ట్ కేశినేని నాని… బుద్దా వెంకన్న

విజయవాడ ప్రభ న్యూస్) తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎంపీ కేశినేని నాని వైసీపీ కోవర్టుగా పని చేశారని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. ఇప్పుడు అసలు ముసుగు తీసి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అసలు ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు అయినా నీకు వస్తాయా అని ఆయన ఎంపీ నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు.

చంద్రబాబు రెండు సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారనీ గుర్తు చేశారు. కేశినేని నానిని తిట్టమని నన్ను చంద్రబాబు ఏనాడు ఆదేశించలేదు అన్నారు. వాస్తవానికి నేను నానిని విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారన్నారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే నేను ఇన్నాళ్లూ ఆగానన్నారు.విజయసాయితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నారు. కేశినేని నాని వైసీపీ కోవర్టు గా తెలుగుదేశం పార్టీలో పని చేశారన్నారు. తాను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని చెప్పిన కేసినేని ఇప్పుడు జగన్ కాళ్లు మొక్క లేదా అని ప్రశ్నించారు.

కేశినేని నాని సినిమా ఇకపై ఉండదన్నారు. తమ్ముడు కేశినేని చిన్ని భార్య జానకీ మీద కేసు పెట్టిన శాడిస్టు నాని అని ఘాటుగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలుస్తాడా..? అని ప్రశ్నించారు. కేశినేని నాని గెలిస్తే.. నా బుద్దా భవన్ ఇచ్తేస్తా, ఓడితే కేశినేని భవన్ నాకిచ్చేస్తారా..? అని సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement