Tuesday, May 7, 2024

Breaking: గంజాయి ధ్వంసానికి వెళ్లిన పోలీసులకు వింత అనుభవం.. ఏడాది చాన్స్‌ ఇవ్వాల‌న్న సాగుదారులు

Andhra Pradesh: గంజాయి సాగుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. పోలీసు శాఖ‌ను అప్ర‌మ‌త్తం చేసింది. 60 రోజులు టార్గెట్‌గా పంట‌ల‌ను లేకుండా చేయాల‌ని, అమ్మ‌కాల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని ఆదేశించింది. దీంతో ప్ర‌త్యేక పోలీసుల బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపారు అధికారులు. ప‌లు జిల్లాల్లో పెద్ద‌మొత్తంలో సాగులో ఉన్న గంజాత తోట‌ల‌ను ధ్వంసం చేయ‌డానికి ప్ర‌త్యేక బ‌ల‌గాలు దాడులు చేస్తున్నాయి..

ఈ క్ర‌మంలో తూర్పు గోదావ‌రి జిల్లా చింతూరు మండ‌లంలో గంజాయి తోట‌ల‌ను ధ్వంసం చేయ‌డానికి వెళ్లిన పోలీసుల‌కు వింత అనుభ‌వం ఎదురైంది. గిరిజన ప్రాంతంలో పెద్ద‌మొత్తంలో గంజాయి పంట సాగులో ఉన్న‌ట్టు స‌మాచారం అంద‌డంతో దాడుల‌కు వెళ్లారు. దాదాపు 10 ఎక‌రాల‌కు పైగానే గంజాయి తోట సాగు చేస్తున్న‌ట్టు స‌మాచారం అందింది. జీ మాడుగుల‌లో గంజాయి తోట‌ల ధ్వంసానికి వెళ్లిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. బంగారం కుదువ పెట్టి పంట పండిస్తున్నామ‌ని, ఒక ఏడాది దాకా అవ‌కాశం ఇవ్వాల‌ని ఆ గ్రామ‌స్తులు పోలీసులను వేడుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య స్థితిలో పోలీసులు ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement