Tuesday, July 23, 2024

BJP – ఎపి బిజెపి ప‌క్ష నేత ఎంపిక అధిష్టానానిదే….

ఎపి బిజెపి శాస‌న స‌భ ప‌క్ష నేత ఎంపిక‌ను ఆ పార్టీ అధిష్టానం నిర్ణ‌యించ నుంది. ఈ మేర‌కు నేడు విజ‌య‌వాడ బిజెపి కార్యాల‌యంలో జ‌రిగిన బిజెపి ఎమ్మెల్యేల స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు.. పార్టీ రాష్ట్ర‌ అధ్య‌క్షురాలు ప‌రందేశ్వ‌రి మ్మెల్యేలతో శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించారు. అధిష్ఠానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ప్రజలు కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారన్నారు. సీఎం ప్రమాణ స్వీకార సభకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర భాజపా తరఫున తామంతా సభకు హాజరవుతున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement