Saturday, April 13, 2024

Shanmukh: గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్ ఫేం షణ్ముక్

బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్ అరెస్ట్ అయ్యాడు. గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో షణ్ముక్ సోదరులు ఇద్దరు ఉన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.


షణ్ముక్ అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్‌పై యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ప్లాట్‌కు వెళ్లారు. పోలీసుల తనిఖీల్లో ప్లాట్‌లో గంజాయి దొరికింది. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement