Tuesday, February 27, 2024

CBI : సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రైన అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించింది. అయితే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని షరతు విధించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే గత శనివారం కూడా అవినాష్ సీబీఐ విచారణకు హాజరుకాగా.. ఇవాళ‌ మరోమారు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎంపీని సీబీఐ విచారించనుంది. వివేకా హత్య జరిగిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలపై అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement