Wednesday, May 1, 2024

AP: వాకర్స్ క్లబ్ పౌండేషన్ డేలో ఫ‌న్.. ఏక్క‌డంటే..

విశాఖపట్నం: వాకర్స్ క్లబ్ చాప్టర్ వన్ పౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు.నగరంలోని దసపల్లా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో గతంలో వాకర్స్ క్లబ్ కు సేవలందించిన 24 మంది మాజీ చైర్మన్లను సత్కరించారు. వాకర్స్ క్లబ్ కార్యదర్శి ఎంవి. సోమశేఖర్ 69 సార్లు రక్తదానం చేసినందుకు గాను ఘనంగా సత్కరించారు .క్లబ్ ద్వారా నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు కమల్ సింగ్ బెయిద్ తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన నృత్య రూపకం ,పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ సుంకర అల్వార్ దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాకర్ల్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ టి. హనుమంతరావు, డి .విశ్వేశ్వర్ వర్మ, ఎస్ రాజేంద్ర,, కంకటాల ప్రభాకర్, జీవి రత్నం ,లక్ష్మి గుప్తా, టివిటి, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement