Sunday, April 28, 2024

AP – తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోండి… మంత్రి బుగ్గన

కర్నూలు బ్యూరో. – ఉమ్మడి జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా-పారిశుద్ధ్యం, జిల్లా గ్రామీణాభివృద్ధి అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, నంద్యాల జిల్లా కలెక్టర్ డా కె.శ్రీనివాసులు, నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్, డిసిఎంఎస్ చైర్మన్ శిరోమణి, కర్నూలు, నంద్యాల జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తాగునీటి అంశంపై సమీక్ష లో భాగంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు తక్కువగా పడినందున ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, సమస్యలు రాకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల్లో, వసతి గృహాల్లో నీటి సమస్య రాకుండా వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు..సభ్యులు లేవనెత్తిన తాగునీటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.. మిడుతూరు, ఓర్వకల్, గూడూరు, వెల్దుర్తి, ఆలూరు, హోళగుంద, చిప్పగిరి, జూపాడుబంగ్లా లోని జడ్పిటిసి, ఎంపీపిలు తాగునీటి సమస్య ను ప్రస్తావించిన నేపథ్యంలో గ్రామాల్లో బోర్లను అద్దెకు తీసుకోవడం, ఉన్న బోర్లను ఫ్లషింగ్, డీపెనింగ్ చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు..వాటికి సాధ్యం కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ అమలు చేయాలని ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ కి సూచించారు..ఫ్లషింగ్, డీపెనింగ్ పనుల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని, పనులు జరిగిన తర్వాత రాండం గా చెక్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు..

.అనంతరం జిల్లా ప్రజా పరిషత్ & మండల ప్రజా పరిషత్ ల వార్షిక బడ్జెట్ 2024 – 2025 మరియు సవరణ బడ్జెట్ 2023-2024 లను ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదాన్ని పొందారు..బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా పరిషత్ కు నిధులు వస్తున్నాయని తెలిపారు. 2014- 15లో రూ. 3.14 కోట్లు, 2015 -16 లో రూ.5.5 8 కోట్లు’ 2016 -17 లో రూ.4.74 కోట్లు’ 2017 -18 లో రూ.5.4 కోట్లు’ 2018 -19లో రూ.4.13 కోట్లు, 2019 -20 లోరూ. 6.14 కోట్లు, 2020- 21 లో రూ.5.80 కోట్లు రాగా తమ పాలక వర్గం ఏర్పడినప్పటి నుండి 2021- 22లో రూ. 10.30 కోట్లు 2022-23 లో రూ.12.17 కోట్లు, 2023 -24 లో 11.14 కోట్లు, 2024 -25 లో రూ.13 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు..అలాగే ఓల్డ్ జడ్పీ బిల్డింగ్ను లీజుకి ఇచ్చే అంశంపై స్టాండింగ్ కమిటీలో చర్చించామని ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతోందని చైర్మన్ సభ్యులకు తెలిపారు.

మంత్రి, ఎంపీ,ఎమ్మెల్యేలకు సన్మానం..

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన.రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్,కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్, నందికొట్కూరు శాసనసభ్యులకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ అధ్యక్షతన సన్మానం చేశారు.

- Advertisement -

రాచర్ల ఎస్ఐ వెంకటరమణ మృతి పట్ల బుగ్గన దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ఎస్సై వెంకటరమణను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఎస్ఐ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు మరణించడం మరింత శోచనీయం అన్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలతో మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణ కుమార్తె అనూషకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్.ఐ వెంకటరమణ లేని లోటును ఆయన కుటుంబ సభ్యులకు తట్టుకునే గుండె ధైర్యం భగవంతుడు ప్రసాదించాలని మంత్రి భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement