Sunday, May 5, 2024

ఏపీ ప్రభుత్వ విద్యార్ధులు @ ప్రపంచ బ్యాంకు

10 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు (IAS)తో సహా ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల ప్రతినిధి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జయకేతనం.!

వాషింగ్టన్ డీసీ – గత కొన్నిరోజులుగా ఆమెరికాలో పర్యటిస్తోన్న ఆంధ్ర ఆణిముత్యాలు తాజాగా వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ ను సందర్శించారు. ప్రత్యేక ఆహ్వానంమేరకు లీడ్ హెల్త్ స్పెషలిస్ట్ రిఫాత్ హసన్, ప్రపంచ బ్యాంకు విశ్లేషకుడు ట్రేసీ విలిచౌస్కీ, లారా గ్రెగొరీ, సీనియర్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ వంటి ప్రపంచ బ్యాంకుతో సహా ప్రముఖ ప్రపంచ బ్యాంకు అధికారులతో విద్య & ఆరోగ్యంపై విస్తృత సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో, ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన అమ్మఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు వాటి వినియోగం, ప్రభుత్వ విద్యారంగంలో సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక కార్యక్రమాలను ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది. మానవ వనరుల పై పెట్టుబడులు పెట్టాలనే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ లక్ష్యానికి ఆండగా నిలుస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవటానికి ప్రపంచ బ్యాంకు తమ సంసిద్ధతను వ్యక్తం చేసిందిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవిష్యత్తులో మరింత ప్రభావవంతమైన విద్యావ్యవస్థను అందించేందుకు సహాయపడాలని అధికారులు ప్రపంచ బ్యాంకును కోరారు.

. ప్రపంచ బ్యాంకు అధికారుల ముందు విద్యార్ధులు ప్రతిపాదించిన ఆంశాలు ఇవే:1. విద్యకు మరింత ప్రోత్సాహం, ప్రాధాన్యత ఇచ్చేలా సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించండి

- Advertisement -

2. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవటమేలా’ అనే ఆంశం, ‘వాతావరణ మార్పులు-స్థిరమైన అభివృద్ధి’ వంటి అంశాలపై చర్చించడానికి ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయండి

3. ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధలు మమేకమైయ్యే కార్యక్రమాలను త్వరితగతిన రుపొందించండి.

4. ప్రభుత్వ పాఠశాలల్లో (పర్యావరణ/సంస్కృతి కార్యాచరణ క్లబ్‌ల ఏర్పాటుకు చర్య తీసుకోండి.

5. మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించండి

Advertisement

తాజా వార్తలు

Advertisement