Monday, September 20, 2021

సీఎం జగన్ ను కలిసిన ఏపీ కొత్త సీఎస్

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్‌ సమీర్‌ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈ నెల 30న ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్ధానంలో తదుపరి సీఎస్‌గా డాక్టర్‌ సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా, రిసోర్స్‌ మొబలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News