Thursday, May 9, 2024

ఏపీలో త్వరలోనే ఆర్గానిక్ పాలసీ: కన్నబాబు

రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకొచ్చేందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నతాధికారుల కమిటీతో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు సమావేశమైయ్యారు. వ్యవసాయ, ఉద్యానవన , ఫుడ్ ప్రోసెసింగ్ , విత్తనాభివృద్ది, జాతీయ సేంద్రియ విధానం సంస్థల ఉన్నతాధికారుల ఆర్గానిక్ పాలసీ ఆవశ్యకతపై మంత్రి కన్నబాబు సుదీర్ఘ చర్చ జరిపారు. రైతులకు రెట్టింపు ఆదాయం , నాణ్యమైన ఉత్పత్తులు , భూసారాభివృద్ది, ప్రజారోగ్యం  ప్రధాన లక్ష్యాలుగా సేంద్రియ వ్యవసాయ పాలసీ వుండాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు అన్నారు. రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో రైతులకు రసాయనాలు , పురుగు మందుల వినియోగం తగ్గించేలా అవగాహనా పెంచాలని సూచించారు.

బయో ఫెర్టిలైజర్స్ , పెస్టిసైడ్స్ , ఇతర రసాయనాల వినియోగంపై మంత్రి, కమిటీ సభ్యుల సుదీర్ఘ చర్చ జరిగింది. డిమాండ్ మేరకే ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సేంద్రియ వ్యవసాయ పద్దతులపై విస్తృతంగా రైతుల్లో అవగాహనా పెంచాలన్నారు. కొత్త పంటల సాగు ప్రారంభం నుంచే  వారిని సేంద్రియ వ్యవసాయ విధానంపై ప్రోత్సాహించాలని కమిటీ సభ్యులు  చెప్పారు. సంబధిత శాఖల సూచనలు అభిప్రాయాలను సేకరించి సీఎంతో చర్చించి త్వరలోనే ఆర్గానిక్ పాలసీని తీసుకొస్తాం అని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: అత్యాచార బాధితురాలికిచ్చిన చెక్కు బౌన్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement