Thursday, September 12, 2024

AP: ఇంజ‌నీరింగ్ కామ‌న్ టెస్ట్ ఫ‌లితాలు విడుద‌ల…

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. జేఎన్టీయూలో ఏపీ ఈసెట్ 2024 (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల చేశారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. ఈసెట్ ఫలితాల్లో విద్యార్ధినులు 93.34 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ప్రకటించారు.

89.35 శాతం విద్యార్ధులకు ఉత్తీర్ణత వచ్చినట్లు చెప్పారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. ఈసెట్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉందని… అత్యల్పంగా విజయనగరం జిల్లా ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. ఏపీ ఈసెట్ 2024(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx ఈ వెబ్‌ సైట్‌ చూసుకోవాలని అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement