Saturday, May 18, 2024

AP: కాలేజ్‌ విద్యార్థులే టార్గెట్‌‌.. విశాఖ‌లో కొకైన్ సప్లయ్‌..

విశాఖలో సిటీలోని ఓ కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థులే టార్గెట్‌‌గా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. స్టూడెంట్స్‌కు అమ్మేందుకు బెంగళూరు నుంచి కొకైన్‌ను తీసుకొచ్చిన‌ట్టు తెలుస్తోంది. విష‌యం తెలియ‌డంతో పోలీసులు దాడులు చేసి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. వారి ద‌గ్గ‌ర నుంచి 30 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకుని.. నలుగురిని అరెస్ట్‌ చేశారు.

కొకైన్‌ రవాణా గురించి కూపీ లాగితే సంచలన విషయాలు తెలిసిన‌ట్టు స‌మాచారం. కార్పొరేట్‌ కాలేజీ స్టూడెంట్స్‌కు కొకైన్‌ అమ్మేందుకే తెచ్చిన‌ట్టు త‌మ విచారణలో తేలింద‌న్నారు పోలీసులు. కొకైన్‌ సరఫరాలో రౌడీ షీటర్‌ రాంకీని కీలక సూత్రధారిగా గుర్తించామ‌న్నారు. ఇత‌ను గతంలో కూడా డ్రగ్స్‌ స్మగ్లింగ్ చేసేవాడ‌ని, ఇత‌నిపై రౌడీ షీట్‌ కూడా ఉంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement