Monday, October 7, 2024

AP | ‘పసుపు’పతిని మ‌రో సారి త‌రిమికొట్టాలి : సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. అన్నమయ్య జిల్లాలో ఇవాళ జగన్ సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. ఆ తర్వాత మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు… పొత్తు పేరుతో ఎన్నికలకు వచ్చే పార్టీలను తరిమికొట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ మళ్లీ వచ్చేశారని, ఆ ముఠా నాయకుడితోనే వైసీపీ యుద్ధం చేస్తోందని జగన్ అన్నారు. ప్రతిపక్షాల కూటమికి ఎవరూ భయపడడం లేదని తెలిపారు.

మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని, అబద్ధాలతోనే బతుకుతున్నారని అన్నారు. 2014లో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నో వాగ్దానాలు చేశారన్నారు. అవి నెరవేర్చలేదని చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు మరోసారి పసుపుపతిగా మారారన్నారు. జగన్ సీఎం అయితేనే అన్ని పథకాలు కొనసాగుతాయని అన్నారు. లంచాలు, వివక్ష లేకుండా ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల ఖాతాల్లో రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

99 శాతం హామీలు నెరవేర్చామని, ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు వైసీపీకి ఉందన్నారు. టీడీపీ పొత్తుకు ప్రజలు 10 మార్కులు వేస్తారని జగన్ అన్నారు. 99 మార్కులు సాధించి మాకు పరీక్షలంటే భయమా అని ప్రశ్నించారు. ఒక్క సీటు కూడా తగ్గేదేలే అని, ఈ సారి డబుల్ సెంచరీ చేయబోమన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదని, జగన్‌ పేరు చెబితేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయని పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకునేవారిని ఎన్నికల్లో తగినవిధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

పేదల భవిష్యత్‌ కోసం వైసీపీ గెలుపు ఖాయమనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 66లక్షల మంది పేదలకు నష్టం కలిగించేలా చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి పింఛన్లు ఆపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మేలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విపక్షాల పొత్తుతో ఎవరూ భయపడడం లేదని తెలిపారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తుకు రాదని, అయితే జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకు వస్తుందన్నారు.

- Advertisement -

సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అడ్డుపడుతున్న వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదల భవిష్యత్తు కోసం వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 66 లక్షల మంది పేదలను నష్టపరిచేలా చంద్రబాబు తన మనుషులు పింఛన్లు ఆపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మంచి చేసే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. విపక్షాల పొత్తుతో ఎవరూ భయపడడం లేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement