Saturday, October 12, 2024

AP | ఇంగ్లండ్ లో పల్నాడు జిల్లా యువకుడు మృతి…

ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లిన ఆంధ్రా యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడిని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన సాయిరాం (24)గా గుర్తించారు.

కాగా, పల్నాడు పోలీసుల వివరాల ప్రకారం… సాయిరామ్ ఉన్న‌త‌ చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లాడు. అయితే ఈ నెల 2వ తేదీన మాంచెస్టర్ బీచ్ వద్ద ఇంగ్లిష్ పోలీసులు సాయిరాం మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే మాంచెస్టర్ పోలీసులు పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement