Friday, May 10, 2024

AP : కుట్రల కూటమిని నమ్మితే పులినోట్లో తలపెట్టినట్టే – జ‌గ‌న్

- Advertisement -

తాడిప‌త్రి టౌన్‌, ప్ర‌భ‌న్యూస్ః ‘‘తాడిపత్రి సిద్ధమేనా..? యుద్ధానికి సిద్ధమేనా..? ఎన్నికల యుద్ధానికి సిద్ధమా..? రాష్ట్రాన్ని విభజించినోళ్లు, అబద్ధాలే అలవాటుగా, మోసాలు, కుట్రలే తమ నైజంగా గుంపులు గుంపులు జెండాలు జతకట్టి కూటమిగా వస్తున్నారు. మీకు మంచి చేసిన మీ ఒక్క బిడ్డ మీదకు వస్తున్నారు. వీరందరికీ బుద్ధి చెప్పటానికి మీరంతా సిద్ధమా?’’ అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. కరువు సీమ తాడిపత్రిలో జన సంద్రం కెరటంలా ఎగిసి పడింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. జరిగిన మంచిని గుర్తు చేసుకుని ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నిటికీ ముగింపు పలుకుతాడు. ఇది చంద్రబాబు చరిత్ర. ఈ చంద్రబాబు సాధ్యం కానీ హామీలతో గుంపులతో వస్తున్నాడు, బాబును నమ్మటమంటే పులి నోట్లో తలకాయ పెట్టటమే. చంద్రముఖిని నిద్ర లేపటమే. బాబును ఇంటికి రానిస్తే.. వదల బొమ్మాళీ.. వదలా అంటూ ఇంటికి వచ్చి రక్తం తాగేస్తాడు. అలాంటి పశుపతిని దూరంగా ఉంచండి’’ అని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు.

నాకు ఏ పొత్తులు వద్దు..
నాకు జండాల పొత్తులు లేవు. మంచి చేసిన పనే నా పొత్తు. నేను ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశాను. బైబిల్, భగవగ్దీత, , ఖురానాగా మేనిఫెస్టో ను భావించాను, అని సీఎం జగన్ వివరించారు. ఇప్పటికి మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు డీబీటీగా కుటుంబాల ఖాతాలకు నేరుగా అక్కాచెల్లెమ్మలకు డబ్బులు పంపించాడు. లంచాలులేని, వివక్ష లేని పనిని, చూపించి ఈ మీ ఆశీస్సులు అడుగుతున్నాడు. అని సీఎం జగన్ తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగాఉంటే ఈ అయిదేళ్లల్లో 2 లక్షల 31 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, అందుకే గ్రామ సచివాలయాల్లో, కొత్త బడుల్లో , కొత్త ఆసుపత్రుల్లో మన బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారని సీఎం జగన్ వివరించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ పౌరసేవలు, పథకాలను డోర్ డెలివరీ చేస్తున్నాం. 58 నెలల్లోప్రజలకోసం మంచి పనులు చేసి మీ చల్లని ఆశీస్సులు కోరుతున్నట్టు తెలిపారు. మాటల్లో కాదు, చేతల్లోనూ సామాజిక న్యాయం కల్పించామన్నారు. మీ బిడ్డ చేసిన పనిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. 68 శాతం పదవులు సామాజిక వర్గాలకే దక్కాయి . ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలకు 100 సీట్లు కేటాయించామని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా , మూడు సార్లు ముఖ్య మంత్రి ఆయన పేరు చెబితే చేసిన ఒక్క సీన్ గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు.

అబద్ధాలతో మెసాలతో యుద్ధం చేస్తున్నాం. 2014లో ఇదే దత్త పుత్రుడు, డిల్లీని వచ్చిన మోడీ ఫోటోలతో చంద్రబాబు పంపించిన పాంప్లెట్లో రైతులకు రూ.87000కోట్లు రూ.14,250 కోట్లు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా? మహాలక్ష్మీ పథకంలో రూ. 25000లు బ్యాంకులో వేస్తామన్నాడు. నిరుద్యోగ భృతి ఇచ్చారా? అన్నారు. అందుకే ఆ మోస పూరిత హామీలు నమ్మోద్దు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement