Tuesday, October 22, 2024

Andhra Pradesh కొలువుదీరిన కొత్త సర్కారు ఏపీలో నూతన శోభ


ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రధాని మోదీ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. అనంతరం ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్‌కల్యాణ్‌ అనే నేను అని ఆయన అనగానే అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఏపీ మంత్రిగా రెండోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. కాగా, ఈ కార్యక్రమానికి మహామహులు హాజరయ్యారు. మంత్రుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేయగా.. మెగా అభిమానులు అరుపులు, కేకలతో సందడి చేశారు.

- Advertisement -

మంత్రుల జాబితా ఇది :

1) పవన్ కళ్యాణ్​
2) నారా లోకేష్
3) అచ్చెన్నాయుడు
4) కొల్లు రవీంద్ర
5) నాదెండ్ల మనోహర్‌
6) పి.నారాయణ
7) వంగలపూడి అనిత
8) సత్యకుమార్‌ యాదవ్‌
9) నిమ్మల రామానాయుడు
10) ఎన్‌ఎండీ ఫరూక్
11) ఆనం రామనారాయణరెడ్డి
12) పయ్యావుల కేశవ్
13) అనగాని సత్యప్రసాద్‌
14) కొలుసు పార్థసారథి
15) బాలవీరాంజనేయస్వామి
16) గొట్టిపాటి రవి
17) కందుల దుర్గేష్‌
18) గుమ్మడి సంధ్యారాణి
19) బి.సి.జనార్దన్‌రెడ్డి
20) టి.జి.భరత్‌
21) ఎస్‌.సవిత
22) వాసంశెట్టి సుభాష్‌
23) కొండపల్లి శ్రీనివాస్రా
24) రామ్‌ప్రసాద్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement