Friday, July 26, 2024

Andhra Pradesh – చంద్ర‌బాబుకు కొత్త కాన్వాయ్ సిద్దం…

ట‌యోటా కంపెనీకి చెందిన మొత్తం వాహ‌నాలు రెడీ
ఇందులోని రెండు వాహ‌నాల‌లో జామ‌ర్లు
అన్నింటికి 393 నెంబ‌ర్ కేటాయింపు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఎపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయన కోసం నూతన కాన్వాయ్ ను సిద్ధం చేశారు.. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు ఉంచారు.. ఇందులో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నెంబర్లు వేశారు. వాటిని చంద్రబాబు కాన్వాయ్ లో వినియోగించ‌నున్న‌ట్లు అధికారులు చెప్పారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement