Thursday, May 23, 2024

హిందూపురంలో హిజ్రా దారుణ హ‌త్య‌..

హిందూపురం శివారులో దారుణం చోటుచేసుకుంది. కొట్నుర్ కొల్లగుంట గ్రామాల మధ్య హిజ్రాను దుండగులు అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేసి ఆపై డీజిల్ పోసి నిప్పంటించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మరణించిన వ్యక్తి హిజ్రా అని వన్ టౌన్ సీఐ మద్దిలేటి బాల తెలిపారు. మృతదేహాన్ని హిందూపురం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. హిజ్రా వివ‌రాల‌ను సేక‌రించే పనిలో పోలీసులు ప‌డ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement