Thursday, May 16, 2024

అనంత వ్యాప్తంగా వ‌ర్షాలు.. అమడగూరులో 74.2 మీటర్ల అత్య‌ధిక వ‌ర్ష‌పాతం

అనంతపురం, ప్రభ న్యూస్‌ బ్యూరో: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా అమడగూరు మండలం లో 7 4.2 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. బుక్కరాయసముద్రం 55.2, చెన్నేకొత్తపల్లి 45.6, రొద్దం 39.6, అగలి 38.6, గుడిబండ 28.2, పెనుగొండ 23.2, రోళ్ల 22.2, ఆత్మకూరు 27.2, కూడేరు 21.2, అనంతపురం 16.4, రాప్తాడు 16.2, యల్లనూరు 15.8, గుత్తి 9.4, కనగానపల్లి 19.4, రామగిరి 19, ధర్మవరం 18.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాలు ఉండగా బుధవారం నమోదైన వర్షపాతం మేరకు ఆయా మండలాల్లో రైతులు వేరుశనగ పంట విత్తనం విత్తేందుకు సిద్ధమవుతున్నారు. పొలాల్లో దుక్కులు దున్నడాన్నికూడా ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement