Wednesday, May 1, 2024

అనంతలో విస్తారంగా వర్షాలు.. వ్యవసాయ పనుల్లో నిమ‌గ్న‌మైన రైతులు

అనంతపురం ప్రభ న్యూస్‌ బ్యూరో: ఉమ్మడి అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు. జిల్లాలో కురిసిన వర్షాల వల్ల చెక్‌ డ్యాములు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మండలాల వారీగా సోమవారం నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. అత్యధికంగా పరిగి మండలం లో 70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు- ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

గుంతకల్లు 54.8, పుట్లూరు 54, పెద్దవడుగూరు 37, ధర్మవరం 35, అమలాపురం 3 2.6, హిందూపురం 32 గుడిబండ 29 చిలమత్తూరు 20 లేపాక్షి 20 సికేపల్లి 20.6 పెద్దవడుగూరు 37 కుందుర్పి 29 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో సైతం వర్షపాతం నమోదయింది. జిల్లాలో 63 మండలాలు ఉండగా ఈ వర్షాల వల్ల రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు. భూమి దున్నడానికి ఎద్దులు లేకపోవడంతో ట్రాక్టర్లు ఇతర పై ఆధారపడాల్సి వస్తోంది. పెరిగిన డీజిల్‌ పెట్రోల్‌ ధరల వల్ల ట్రాక్టర్ల బాడుగ లు సైతం పెరిగిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement