Thursday, April 18, 2024

ఏపీ ప్రీమియర్‌ లీగ్‌ టీ-20 లోగో ఆవిష్కరణ..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ-20 క్రికెట్‌ టోర్నమెంట్‌ లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈమేరకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. లోగోతో పాటు ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ-20 టీజర్‌ను ల్యాప్‌టాప్‌లో ఆవిష్కరించారు. జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నం డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. వచ్చేనెల 17న జరిగే ఫైనల్‌కు ముఖ్యఅతిథిగా రావాలని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ టీమ్‌ సీఎం జగన్‌ను ఆహ్వానించారు. ఐపీఎల్‌ తరహాలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌, బీసీసీఐ నుంచి ఏపీఎల్‌ నిర్వహించేందుకు అనుమతులు పొందినట్లు తెలిపారు.

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌, ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, సౌరాష్ట్రకు బీసీసీఐ అనుమతులు ఇచ్చింది. నాలుగో రాష్ట్రంగా ఏపి నిలిచింది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏసీఏ ప్రెసిడెంట్‌ పి.శరత్‌ చంద్రారెడ్డి, టెజరర్‌ ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌ రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ టి సత్యప్రసాద్‌, సభ్యులు ప్రసాద్‌, గోపాల రాజు, టెక్నికల్‌ ఇంచార్జి విష్ణు దంతుతో పాటు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.


Advertisement

తాజా వార్తలు

Advertisement