Friday, July 26, 2024

NMD Farooq: టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఫరూక్‌కు… తప్పిన ప్రమాదం

పాణ్యం ( ప్రభ న్యూస్):నంద్యాల జిల్లా, పాణ్యం మండలం, తమ్మరాజు పల్లె గ్రామం వద్ద 40 నెంబర్ జాతీయ రహదారిపై గేదెలను ఢీకొని నంద్యాల టిడిపి అభ్యర్థి ఎం ఎం డి ఫరూక్ కు కారులో స్వల్ప గాయాలయ్యాయి. మంగళవారం ఉగాది పండుగ రోజు నంద్యాల నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఫరూఖ్ కారు తమ్మరాజు పల్లి గ్రామంలో జాతీయ రహదారి పై వెళ్తున్న గేదలు అడ్డు రావడంతో ఉన్నపలంగా కారు గేదెలను ఢీకొనడంతో అక్కడికక్కడే రెండు గేదెలు మృతి చెందాయి.

అభ్యర్థి కారు సుమారుగా 70 శాతం నుజ్జు నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పాణ్యం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న కుమారుడు ఎన్.ఎం.డి ఫిరోజ్ సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ లో నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ప్రమాదానికి గురైన కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడం తో ముందున్న వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గాయాలతో బయటపడ్డారు. అక్కడ ఉన్న టిడిపి నాయకులు, గ్రామస్తులు, సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారులో నుంచి ఫరుకును మెల్లగా కిందికి దించి అంబులెన్స్ వాహణo లో చికిత్స నిమిత్తం నంద్యాల వైద్యశాలకు తరలించారు.

అచ్చిరాని 40 నెంబర్ జాతీయ రహదారి

- Advertisement -

టిడిపి పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో 40 నెంబరు జాతీయ రహదారి అచ్చి రావడం లేదన్నది ప్రస్తుతం జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం. 2014లో ఆళ్లగడ్డ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైన భూమా శోభనాగిరెడ్డి ప్రచారం చేస్తూ ఆళ్లగడ్డకు తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి కూడా అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఛాతి నొప్పితో మృతి చెందారు. నెరవాడ మెట్ట సమీపంలోని ఆర్ జి ఎం కళాశాల పక్కన ఉన్న కేశవరెడ్డి పాఠశాల ప్రధాన ముఖద్వారం ఎదురుగా 2011లో కడప పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రమాదానికి గురై మృతి చెందారు. అయినా మండు వేసవి కాలంలో అభ్యర్థులు ప్రచారానికి పోతూ ఇలా ప్రమాదాలకు గురి కావడం ఎంతో బాధాకరంఅని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement