Tuesday, July 23, 2024

ACB Ride – పురుషోత్తపురం చెక్ పోస్ట్ పై ఎసిబి దాడులు

ఇచ్ఛాపురం, పురుషోత్తపురం రవాణా శాఖ చెక్పోస్ట్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు శ్రీకాకుళం డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సిఐలు ఇద్దరు ఎస్ఐల బృందం నిర్వహించింది అర్ధరాత్రి 1:30 గంటల నుండి ఇప్పటివరకు కొనసాగించింది.
చెక్ పోస్ట్ లోని రవాణా శాఖ కౌంటర్ ను తన స్వాధీనంలోకి తీసుకుని రికార్డులు తనిఖీ చేశారు.

చెక్ పోస్ట్ లో జూలై నుండి నగదు రహిత లావాదేవీలు ప్రారంభమైనప్పటికీ సహాయ మోటార్ వెహికల్ ఇనెస్పెక్టర్ అనిల్ కుమార్ ఇద్దరు కానిస్టేబుల్ నుండి రూ. 1.30 లక్షలు అనధికార సొమ్ము స్వాధీనం చేసుకున్నట్ల్లు తెలిపారు. ఏఎంవిఐ, ఇద్దరు కానిస్టేబుల్ లను విచారిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు.

ఫోటో:

Advertisement

తాజా వార్తలు

Advertisement