Sunday, May 19, 2024

Wrestling Squad | ఒలింపిక్స్‌కు రెండు దశల్లో రెజ్లర్‌ల ఎంపిక

2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు రెజ్లింగ్‌ స్క్వాడ్‌ ఎంపికకు రెండు దశల వడపోత ప్రక్రియ చేపట్టనున్నారు. మొదటి దశలో ఎంపికైన గ్రాప్లర్లు వచ్చే ఏడాది జూన్‌లో ఛాలెంజర్‌తో పోటీపడతారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.

ఇప్పటివరకు 53 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత యాంటిమ్‌ పంఘల్‌ మాత్రమే తొలిదశ పోటీకి స్థానం సంపాదించింది. ఆమె కూడా జూన్‌1న ఛాలెంజర్‌ తో పోటీపడాల్సి ఉంటుంది. యువ యాంటిమ్‌ పారిస్‌ బెర్త్‌ కోసం ప్రధాన ప్రత్యర్థి వినేష్‌ ఫోగాట్‌తో పోటీపడే అవకాశముంది.

ఛాలెంజర్‌లందరినీ మే 31న నిర్ణయిస్తామని, ఛాలెంజర్‌ మరియు ఒలింపిక్‌ కోటా విజేతల మధ్య జూన్‌ 1న బిగ్‌ఫైట్‌ జరుగుతుందని ఐఓఏ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి యాంటిమ్‌ పంఘల్‌ మాత్రమే ఎంపికైనప్పటికీ, కిర్గిజ్‌స్థాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫైయర్‌ (9-12)తర్వాత మరింత మంది రెజ్లర్లు రేసులోకి వస్తారని భూపేందర్‌సింగ్‌ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక కమిటీ స్పష్టంచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement