Wednesday, May 1, 2024

Telangana – కార్పొరేష‌న్‌ ఉద్యోగుల‌కు రేవంత్ వ‌రం – మ‌ధ్యంత‌ర భృతి ఇచ్చేందుకు ఆదేశం

హైద‌రాబాద్ – రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఎంప్లాయీస్‌కు వేతన సవరణలోని ఐఆర్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగులకు 5శాతం ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించగా.. అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ రావడం తో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ రంగ సంస్థల ఎంప్లాయిస్ కలిశారు. పీఆర్సీ, ఐఆర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. సీఎం వెంటనే స్పందించి ఆర్థిక శాఖకు నోట్ పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తాజాగా ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ సంస్థల స్పెషల్ సెక్రటరీ లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement