Saturday, April 20, 2024

ఆచార్య మ్యూజిక్ ఆల్బమ్ పై మరో అప్డేట్ !!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మెగా పవర్ స్టార్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్ పై మంచి హైట్ క్రియేట్ అవుతుంది. దానికి కారణం లేకపోలేదు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మ పనిచేస్తున్నారు. గతంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాట కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోని మరో సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ పాట పూజా హెగ్డే చరణ్ ల మధ్య ఉండనుందట. ఈ సాంగ్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే ఈ సాంగ్ లీక్ కాగా అది విన్న వారు చాలా బాగుందని మాట్లాడుకున్నారట. మరి సాంగ్ ని ఎప్పుడు విడుదల చేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement