Tuesday, May 7, 2024

ఆసుపత్రిలో యువకుడు హాల్ చల్ – బ్లేడుతో ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఓ యువకుడు హాల్ చల్ చేశాడు. సోమవారం నిజామాబాద్ నగరంలోని నిజాంకాలనీకి చెందిన కలీం అనే యువకుడు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిలో ఆసుపత్రి సూపరీ టెండెంట్ ఛాంబర్ ఎదుట యువకుడు తనను తాను మెడపై బ్లేడు తో కోసుకొని ఆత్మహత్నయత్నం చేయడం కలకలం రేపింది.

గతంలో కూ డా ఈ యువకుడు ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘట నలు కూడా ఉన్నాయి. కలీం మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేక గతంలో ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. నిజామా బాద్ నగర శివారు కు చెందిన నిజాం కాలనీకి చెందిన 21 ఏళ్ల షేక్ ఖలీమ్ గత కొన్ని సంవత్స రాల క్రితం బాధితుడు ఆయన తల్లి ఆసుపత్రిలో ఆయాగా విధులు నిర్వహి స్తుండే వారని అయితే కొన్ని కారణాల ఔట్సోర్సింగ్ జిల్లా ఆసుపత్రికి సంబంధించిన కాంట్రాక్టర్ వారిని విధుల నుంచి ఎందుకు తొలగించారని ఆరోపిస్తూ తమ కుమా రుడు ఆత్మహత్యకు పాల్ప డ్డారని బాధితుని తల్లి ఆరోపించారు.

మధ్యానికి, కల్లుకు బానిసై ఇలాంటి ఘటనలు చేసుకుం టున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గతంలో కలీం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలు పారిశుద్ధ కార్మికుడిగా పని చేశాడు. *యువకుడి వీరంగం* ఆత్మహత్యయత్నం చేసుకున్న యువకుడు చికిత్స పొందిన అనంతరం సోమవారం సాయంత్రం మానసిక పరిస్థితి బాగా లేక ఆ యువకుడు ఎవరిని పడితే వారిని తిడుతూ… ఆస్పత్రిలో వీరంగం సృష్టించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement