Sunday, February 25, 2024

పెళ్ళి కాదని మనస్తాపం తో యువతి ఆత్మహత్య..

తిమ్మాపూర్ మే 6 ప్రభ న్యూస్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల‌ రెడ్డి రజిత 19 తన ఇంటివద్ద క్రిమి సంహారక మందు త్రాగి ఆత్మహత్య చేసుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..ప్రేమకు కట్నం అడ్డు రావడంతో మ‌రో వ్య‌క్తితో ఎంగేజ్మ్మెట్ జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో త‌న‌కు ఇక పెళ్లి కాద‌నే భ‌యంతో యువతి మనస్థాపానికి గురై క్రిమిసంహారక మందు తాగింది.. ఇది గ‌మ‌నించిన బంధువులు కరీంనగర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు.. అక్క‌డే ఆ యువ‌తి మ‌ర‌ణించింది.. ఈ మృతి కి పల్లె వెంకటేష్, పల్లె రాములు, పల్లె సరవ్వ, గుండె కల్యాణి రమ్య, గుండె రాజు లు కారణమని రెడ్డి అహల్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.. దీంతో ఎల్ ఎం డి ఎస్ ఐ ప్రమోద్ రెడ్డి కేసునమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement