Thursday, April 25, 2024

Weekly Dose – లండ‌న్ బ్రిడ్జిపై బుల్లిపిట్ట – కెమెరాలో బంధించిన ఎంపి సంతోష్ కుమార్

హైద‌రాబాద్ – గ్రీన్ ఛాలెంజ్ కు ఆద్యుడైన ఎంపి సంతోష్ కుమార్ తాజాగా త‌న‌లోని ఫోటో గ్ర‌ఫీ స్కిల్స్ తో అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నారు.. స‌హ‌జంగానే ప్ర‌కృతి ప్రియుడైన సంతోష్ త‌న ఫోటో గ్ర‌పీ కాన్వాస్ గా ఆ ప్ర‌కృతినే ఎంచుకున్నారు.. ఇటీవ‌ల ఆయ‌న బ్రిటన్ లో పర్యటించారు.. లండన్ లో ప్రఖ్యాత ఐకాన్ వంతెన‌పై ఆయ‌న విహ‌రించారు.. ఈ సంద‌ర్బంగా అక్క‌డ ప‌క్షుల కిల‌కిలరావాల‌కు ముగ్దుడైన ఆయ‌న వాటిని త‌న కెమెరాలో బందించారు.. ఒక వైపు లండ‌న్ వంతెన‌, దానివైపే చూస్తున్న బుల్లిపిట్ట ను మ‌నోహారంగా త‌న కెమెరా నేత్రంతో చిత్రీకరించారు… వాటిని త‌న ట్విట‌ర్ లో పోస్ట్ చేస్తూ హ్యాపీ సండే అంటూ ట్విట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement