Monday, April 29, 2024

Weather Report – తెలంగాణలో మ‌రో అయిదు రోజుల పాటు ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు

హైద‌రాబాద్ – తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్.. మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది.. ఇప్పటికే గత రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఐదు రోజులు అంటే జనాలు హ‌డ‌లెత్తిపోతున్నారు. అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.. తెలంగాణలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement