Sunday, March 24, 2024

స్వర్గీయ వీరపనేని శివాజీ ఆశయ సాధనకు కృషి చేస్తా : మంత్రి ఎర్రబెల్లి

ములుగు : పేద ప్రజల సంక్షేమానికి నిత్యం తపించి, సమాజ హితం కోరిన స్వర్గీయ వీరపనేని శివాజీ అభివృద్ది ఆశయ సాధనకు కృషి చేస్తానని, గోవింద రావు పేట, ములుగును సమగ్రంగా అభివృద్ది చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. ములుగు జిల్లా, గోవింద రావు పేటలో నేడు స్వర్గీయ వీరపనేని శివాజీ గారి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. శివాజీ మీద ఉన్న అభిమానం, గోవింద రావు పేట ప్రజల మీద ఉన్న ప్రేమతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంద‌న్నారు. మీ ఊరికి శివాజీ మంచి సేవ చేశారు. 75 సంవత్సరాల ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు వారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం నాకు గర్వంగా ఉందన్నారు. ఎన్టీ రామారావు వరంగల్ వస్తున్నప్పుడు నేను అప్పుడు జిల్లా కన్వీనర్ గా ఉన్నాను. అప్పటి నాయకులం.. మేము పిల్లలం. రామారావు రాక సందర్భంగా ఏర్పాట్లు మా నుంచి కావడం లేదు.. మీరు ముందుండి చేయాలి అని రామారావుని బాగా అభిమానించే శివాజీ ని అడిగితే ఒప్పుకున్నారు. ఆ రోజు 1982లో నాయకత్వం శివాజీ చేతిలో పెట్టాం. అప్పటి నుంచి ఆయన ఈ ప్రాంతం కోసం చాలా చేశారు. మొత్తం రాష్ట్రంలోనే 400 ఇండ్లు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని ఒప్పించి కట్టించిన మహానుభావుడు శివాజీ అన్నారు. అదేవిధంగా గోవింద రావు పేటను మండలం చేయించారు. నా రాజకీయ జీవితంలో ఇద్దరు ముఖ్యమంత్రులను నేను బాగా అభిమానిస్తాను. ఒకరు ఎన్టీ రామారావు, మరొకరు కేసిఆర్ అన్నారు. పెన్షన్ ఇచ్చింది, 2 కిలోల బియ్యం ఇచ్చి, పేద ప్రజల సంక్షేమానికి రామారావు కృషి చేశారు. రామారావు గోవింద రావు పేటను మండలం చేస్తే, సీఎం కేసిఆర్ ములుగును జిల్లా చేశారు. అంతటితో ఆగక జిల్లాను సమగ్రమగాభివృద్ది చేశారు. ములుగుకు 550 కోట్ల రూపాయలతో 300 పడకల కట్టి మెడికల్ కాలేజీ నిర్మించారు. నేను సేవ చేయాలని ఇక్కడి పెద్దలు కోరుతున్నారు. కాబట్టి శివాజీ పేరు మీద ఈ ఊరిలో సందు, సందుకు సిమెంట్ రోడ్లు వేయిస్తాను అన్నారు. ఆ తర్వాత మండలంలో , నియోజక వర్గంలో, జిల్లాలో వేయిస్తాను అని అమ్మ భాగ్యలక్ష్మి, తమ్ముళ్లు రామకృష్ణ, రవికాంత్ లకు హామీ ఇస్తున్నాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement