Monday, July 15, 2024

TS: కలెక్టరేట్ లో రైతు ఆత్మహత్యాయత్నం…

రైతును ఆసుపత్రికి తరలించిన పోలీస్ శాఖ…
ప్రభ న్యూస్ జనగామ : జనగామ కలెక్టరేట్ కార్యాలయంలో రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన సోమవారం కలెక్టరేట్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం…. నిమ్మల నరసింగరావు (29) జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన యువరైతు కలెక్టరేట్ ప్రజావాణిలో తన భూమిని పట్టా చెయ్యాలని గతంలో పలుమార్లు ప్రజావాణిలో వినతి చేశారని.. అయినా అధికారులు పట్టించుకోలేదని మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.

ఈరోజు కూడా ప్రజావాణిలో తన భూమి పట్టా చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కలెక్టరేట్ కార్యాలయంపైకి ఎక్కి బ్యానర్ కట్టి మరీ రైతు పురుగుల మందు సేవించడంతో కలకలం రేపింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఆ రైతును కిందకి దింపి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఏది ఏమైనా ప్రతి ప్రజావాణిలో భూ ధరణి సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement