Monday, October 7, 2024

విద్యార్థులకు ఓటర్ నమోదు పై అవగాహన సదస్సు

మణుగూరు ఆగష్టు 25,(ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు మణుగూరు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఓటర్ నమోదు పై అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాఘవరెడ్డి విద్యార్థులకు ఓటర్ నమోదు, ఓటు యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలన్నారు.

ఓటర్ హెల్ప్ లైన్, ఎన్ వి ఎస్ పి పోర్టల్ ద్వారా ఓటు నమోదు గురించి తెలుసుకోవడమే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్ నమోదు వివరాల కోసం స్థానిక తహసీల్దార్ కార్యా లయం, బూత్ స్థాయి అధికారులను సంప్రదిం చాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ఫార మ్-6 పత్రాలు అందించి ఓటు నమోదు చేయించు కుందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బి. శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది. కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement