Friday, October 4, 2024

TS : రేపు వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి మోదీ శంకుస్థాపన..

వికారాబాద్, ఫిబ్రవరి 25 ( ప్రభ న్యూస్): అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.

- Advertisement -

వికారాబాద్ జంక్షన్ ను సైతం ఇందులో భాగంగా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు 24.35 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటి కోసం రూ.843.54 కోట్లను కేటాయించారు.ఆ రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు 26న మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement