Tuesday, April 30, 2024

TS : పేదింటి ఆడ‌బిడ్డ‌కు అండ‌గా ఉప్ప‌ల ఫౌండేష‌న్

పేదింటి ఆడ‌బిడ్డ‌కు అండ‌గా ఉప్పల ఫౌండేష‌న్ నిలిచింది. పేదంటి అమ్మాయి వివాహానికి హైదరాబాద్ లోని నాగోల్ లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త త‌న క్యాంపు కార్యాల‌యంలో చేయూత‌నందించారు. అమ్మ‌వాయికి మంగళసూత్రం,మెట్టెలు,చీరె, గాజులు విరాళంగా అందించారు.

సికింద్రాబాద్ ఖుషి కాల‌నికి చెందిన నిరుపేద కుటుంబం రత్నప్రభ – చంద్ర శేఖర్‌ల కూమార్తె విష్ణు పల్లవి వివాహం కోసం ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తాను సంప్ర‌దించ‌గా, ఆయ‌న స్పందించి మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో.. పెళ్లి కూతురు, శ్రీధర్, పల్లవి, జై దామోదరం కౌన్సిలర్,దాసు, నరేష్, రాకేష్, బాలరాజు, శివకుమార్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement