Friday, May 10, 2024

Twit War – జితేంద‌ర్ రెడ్డికి ఈట‌ల చుర‌క‌లు….

హైద‌రాబాద్ – నిన్న వివాద‌స్ప‌ద ట్విట్ట‌ర్ వీడియోతో పాటు కామెంట్స్ పోస్ట్ చేసిన బిజెపి సీనియ‌ర్ నేత జితేంద‌ర్ రెడ్డి కి ఆ పార్టీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ చుర‌క‌లంటించారు. ఆ ట్వీట్‌ ఏంటో, దానికి అర్థమేంటో జితేందర్ రెడ్డినే అడగాలని అన్నారు. వయసు, అనుభవం పెరిగిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని ఈటల చెప్పారు. ఏది పడితే అది చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవాన్ని తగ్గించకూడదని, ఈ విషయాన్ని బేసిక్‌గా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఒక ట్విట్ తో చాలా న‌ష్టాలు క‌లుగుతాయ‌ని గుర్తించాల‌ని హిత‌వు ప‌లికారు..

కాగా, తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ . ట్రాలీలోకి ఎక్కకుండా సతాయిస్తున్న దున్నపోతు తోక మెలితిప్పి, తంతున్న వీడియోను జితేందర్ రెడ్డి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీకి కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ ఆయన పెట్టిన కామెంట్.. టీబీజేపీలో కలకలం రేపింది. దీనిపై ఈట‌ల ఘాటుగానే స్పందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement