Wednesday, May 15, 2024

TS : తుంగతుర్తి బిజెపి అభ్యర్థి రోడ్ షో ను అడ్డుకున్న ఎన్నికల కోడ్ అధికారి

మోత్కూర్ ,నవంబర్ 2 (ప్రభ న్యూస్) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో గురువారం స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తుంగతుర్తి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కడియం రామచంద్రయ్య గురువారం స్థానిక శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోడ్ షో లో భాగంగా ర్యాలీగా వాహనంపై వెళ్తుండగా స్థానిక చెరువు కట్ట వద్ద ఇంఛార్జి ఎన్నికల కోడ్ అధికారి,మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ,ఏ ఎస్ ఐ ప్రభాకర్ నాయుడు,కానిస్టేబుల్ రామారావు రోడ్ షో వాహనాన్ని ఆపి అభ్యర్థి రామచంద్రయ్యతో పర్మిషన్ ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

పర్మిషన్ లేకపోవడంతో డోర్ టు డోర్ ప్రచారం చేయాలి తప్ప, అనుమతి లేదని తెలుపగా బిజెపి కార్యకర్తలు అధికార పార్టీ నాయకుల మద్దతుతో రోడ్ షో ను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని, సదరు అధికారితో కార్యకర్తలు కొద్దిసేపు వాగ్వివాదం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రయ్య మెయిన్ రోడ్డుపై పార్టీ కార్యకర్తలతో కలిసి నడుచుకుంటూ వ్యాపార వర్గాలను కలిసి ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement