Wednesday, October 16, 2024

TS – తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవం ఎన్నిక ..

హైద‌రాబాద్ – తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్​ యాదవ్, బీఆర్​ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.

కాగా..నేడు అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. ఇది ఇలా ఉంటే రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో 3 స్థానాలకు ముగ్గురే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. బీఆర్‌ఎస్‌ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్​ నుంచి రేణుకా చౌదరి, అనిల్​ కుమార్​ యాదవ్ నామినేషన్​ దాఖలు చేశారు. మరోవైపు.. శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్లు వేశారు. అయితే వారి నామినేషన్లను ఈసీ తిరస్కరించడంతో ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక‌ను నేడు అధికారికంగా ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement