Sunday, April 28, 2024

TS – వ‌ర్ష‌పాతం త‌గ్గ‌డంతోనే నీటి క‌ష్టాలు…మంత్రి పొన్నం

గ‌త ఏడాది వ‌ర్ష‌పాత వివ‌రాలు అందిస్తాం
మేం అధికారంలోకి వ‌చ్చేస‌రికి వాన‌కాలం పోయింది.
నీటి క‌ష్టాలు తెలంగాణ అంత‌టా ఉంది
తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం..
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డి

క‌రీంన‌గ‌ర్ – నీటి ఎద్ద‌డికి వ‌ర్ష‌పాతం త‌గ్గ‌డ‌మేన‌ని అన్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్…బిఆర్ ఎస్ అధికారం ఉన్న కాలంలోనే వ‌ర్షాలు స‌రిగా ప‌డ‌లేద‌ని, తాము అధికారంలోకి వ‌చ్చేస‌రికి వ‌ర్ష‌కాలం వెళ్లిపోయింద‌న్నారు.. పోయిన సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలేదని అంటూ. 2022-23 వెదర్ రిపోర్ట్ ప్రజలకు తెలియజేస్తామన్నారు. క‌రీంన‌గ‌ర్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, పంట నష్టం గురుంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు.

తాగు నీటి స‌మస్య లేకుండా చూస్తాం..

హైదరాబాద్ నగర తాగు నీటి అవసరాలకు సింగూర్ నుండి 18 శాతం, గోదావరి నుండి 35 శాతం కృష్ణా నుండి 45 శాతం ,ఉస్మాన్ సాగర్ నుండి 4 శాతం నీటిని వాడుతున్నామని క్లారిటీ ఇచ్చారు. నాగార్జున సాగర్ లో 510 అడుగుల నీళ్లు ఉన్నవి, అవసరమైతే బూస్టర్ పైప్ ల ద్వారా వాటర్ తరలిస్తామన్నారు. ఎల్లం పల్లి నుండి కూడా 3 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నామని తెలిపారు. కరవు ఎదుర్కోవడానికి ప్రతి పక్షాలు సహకరించాలని కోరారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement