Friday, October 4, 2024

TS – ముగిసిన నాగోబా జాతర… వివిధ రూపాలలో రూ.20 లక్షల ఆదాయం..

ఇంద్రవెల్లి. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన నాగోబా జాతర ఈ నెల 9. నుంచి 15 వరకు వారం రోజుల పాటు నిర్వహించారు. ఈ జాతరలో ప్రతి ఏటా వచ్చే ఆదాయాన్ని ఆదివారం నాడు దేవాదాయశాఖాధికారి రాజమౌళి,రెవెన్యూ,మెస్రం వంశీయుల ఆధ్వర్యములో లెక్కించారు . మొత్తం భక్తులు కానుకల రూపములో సమర్పించిన హుండి ఆదాయం 8,62,015 రాగా , తయ్ బజార్ ద్వారా 7,25,000, పేలాలు పుటనలు 44,000, కొబ్బరి చిప్పలు 10,500, ఎలక్ట్రిసిటీ 1,28000, వాహనాల పార్కింగ్ 90,000, కొబ్బరి కాయల దుకాణం 24,300 , రంగుల రాట్నం ద్వారా 1 లక్ష, వచ్చింది. మొత్తం ఆదాయం 19,83,815 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement