Wednesday, October 2, 2024

TS – మేడిగడ్డ రిపేరు ఉచితంగా చేసేందుకు ముందుకు వచ్చిన ఎల్‌ అండ్‌ టీ

.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ దగ్గర మూడు పిల్లర్లపై కాఫర్ డ్యామ్‌ను ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించబోతున్నది. మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరదలు వచ్చేలోపు మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యామ్‌ను సైతం సైతం ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించనుంది . మాజీ సిఎం కేసిఆర్ తీవ్ర వత్తిడి తీసుకు రావడం వల్లే ఇది సాధ్యమైందని ఆ పార్టీ తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement