Saturday, October 5, 2024

TS – ఇచ్చిన మాట నిలుపుకున్న కేటీఆర్

హైదరాబాద్ – మూడు రోజుల క్రితం రాజేంద్రనగర్ మిలీనియం పాఠశాల విద్యార్థులకు ‘ఎక్స్’ వేదికగా ఇచ్చిన మాటను బీఆర్ఎప్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిలబెట్టుకున్నారు.

తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలని విద్యార్థులు ‘ఎక్స్’లో కేటీఆర్ను కోరారు. తనకు మరో షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఇంత అద్భుతమైన ఆహ్వానం పంపిన చిన్నారుల కోసం వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆదివారం పాఠశాలకు వెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. తనకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. తమ విద్యార్థుల కోరికను మన్నించి వచ్చినందుకు కేటీఆర్ కు పాఠశాల యాజమాన్యంతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement