Wednesday, June 19, 2024

TS – బిఆర్ఎస్ నాలుగు ముక్క‌లు కావ‌డం ఖాయం – మంత్రి కోమ‌టిరెడ్డి

హైదరాబాద్‌: త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ నాలుగు ముక్కలు కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అలాగే, మాజీ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలు కేసీఆర్‌, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడుతూ.. హరీష్‌రావు ముఖ్యమంత్రి కావాలనే ప్లాన్‌లో ఉన్నట్టున్నార‌ని, కేసీఆర్‌ను వ్యతిరేకించే వస్తే తాము అందుకు సపోర్టు చేస్తామ‌ని అన్నారు. . బీఆర్‌ఎస్‌ పార్టీ కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత పేర్ల మీదుగా విడిపోతుంద‌ని,త్వ‌ర‌లోనే బీఆర్‌ఎస్‌లో నాలుగు పార్టీలు అవుతాయని జోస్యం చెప్పారు..

హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎల్పీ లీడర్ కూడా కాలేర‌న్నారు. ఆయన 20 మందితో బ‌య‌ట‌కు వ‌స్తేనే పార్టీ లీడర్ కాగ‌ల‌ర‌ని అన్నారు. కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నార‌ని.. ఆయన పులి ఎట్లా అవుతార‌ని అన్నారు. . 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న నేనేం కావాల‌ని ప్ర‌శ్నించారు… ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement