Saturday, April 20, 2024

TS – ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టినోడు సిఎం – దౌర్భగ్యమన్న హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రం కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేశాడని.. కానీ ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టినోడు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం దౌర్భగ్యంగా మాజీ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.

ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ అని స్పష్టం చేశారు. చావు నోట్లో తల పెట్టీ కేసీఆర్ తెలంగాణ సాధిస్తే.. తెలంగాణ అమరవీరులకు ఒక్క నాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అని వ్యక్తి సీఎం అయ్యాడని వివరించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ కృతజ్ఞత సభల్లో భాగంగా మంగళవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వం, రేవంత్‌ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ప్రజలు ఓటు వేశారు. గెలుపు ఓటములు ఉంటాయి. అధికారం, ప్రతిపక్షం అయినా మనం ప్రజల పక్షం ఉందాం’ అని పార్టీ శ్రేణులకు చెప్పారు. కాంగ్రెస్‌ వెంట పడి హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు.

కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే ఒక్క ఫోన్ కొట్టండి గంటలో ఉంటామని హరీశ్‌ రావు ప్రకటించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చామని గుర్తుచేశారు. ఏనాడు జై తెలంగాణ అని వారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మళ్లీ స్పీడ్ అందుకుంటామని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే కేసీఆర్ నల్లగొండలో గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం చేశారని వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement