Wednesday, April 17, 2024

TS – ఈ నెల 24న తెలంగాణ‌కు రానున్న అమిత్ షా…

హైద‌రాబాద్ – కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తోన్న విజయ సంకల్ప యాత్రలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నిక‌ల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో పది ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్రలను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఐదు క్లస్టర్లలో నిర్వ‌హించే ఈ యాత్ర‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయపార్టీ ముఖ్యనేతలు యాత్రల్లో పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement